- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రస్ట్రేషన్లో ఈటెల రాజేందర్
బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. రాజకీయాల్లో హుందా తనం, ఓర్పు కలిగిన వ్యక్తులలో ఈటెల రాజేందర్ ఒకరు.

- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. రాజకీయాల్లో హుందా తనం, ఓర్పు కలిగిన వ్యక్తులలో ఈటెల రాజేందర్ ఒకరు. అలాంటి వ్యక్తి దిగజారుడు రాజకీయం చేయడం సమంజసం కాదు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని తామే రాజకీయ పాఠాలు నేర్చుకున్నాం. కాని ఆయనపైనే నేను మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా కొడకా అనే పదం ఈటెల ఉపయోగిస్తారని అనుకోలేదు.
బీజేపీలో ఈటెలకు సముచిత స్థానం లేకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు తెలుస్తొంది. ఈటెలపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాఖ్యలు చేయడం, ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది.. రుణమాఫీ చేసినందుకా..? వరికి బోనస్ ఇస్తున్నందుకా.. సన్న బియ్యం ప్రజలకు సరఫరా చేస్తునందుకా అంటూ ప్రశ్నించారు. సంక్షేమం అందిస్తున్నందుకు ప్రభుత్వం కూలిపోవలా చెప్పండి ఈటెల రాజేందర్ అంటూ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో మెచ్యూరిటీ ఉన్న మీకు ఇలాంటి భాష మంచిది కాదని హితువు పలికారు. రాజకీయాలు పలచన కాకూడదు అంటే బూతులు మాట్లాడకూడదు. బాధ్యతగా వ్యవహరించాలి. ఈటెల తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు.






