ప్రతీ 40 కిలోల బ్యాగ్‌కు 3 కిలోల తరుగు తీయడమేంటి.. డీకే అరుణ సీరియస్

by Disha Web Desk 2 |
ప్రతీ 40 కిలోల బ్యాగ్‌కు 3 కిలోల తరుగు తీయడమేంటి.. డీకే అరుణ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 40 కిలోల ధాన్యం బస్తాకు 3 కిలోల తరుగు తీస్తూ రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని ఆమె అన్నారు. రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ ఖాతాలో వేసుకుంటోందని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహచరించడంలేదని డీకే అరుణ విమర్శలు చేశారు. తమ వంతు ఇవ్వాల్సిన నిధులను కూడా బీఆర్ఎస్ సర్కార్ కేటాయించడం లేదని ఆమె ధ్వజమెత్తారు. రైతులకు తీవ్రంగా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరే జెండా కాషాయ జెండానే అని ఆమె ధీమా వ్యక్తంచేశారు. నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఆమె సూచించారు.

Also Read..

MLA టికెట్ల కేటాయింపుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు


Next Story

Most Viewed