- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని ప్రసంగంపై కాదు బడులపై దృష్టి పెట్టండి.. KTR కు DK Aruna కౌంటర్..
దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్ బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ..

దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి కేటీఆర్ బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గం అని సాక్షాత్తు ప్రధానమంత్రే సెలవిచ్చారని… అయితే, ఇది ప్రధాని ప్రసంగంలో టెలీ ప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని తాను గట్టిగా భావిస్తున్నానని కేటీఆర్ సెటైర్లు వేశారు. దీంతో, కేటీఆర్ ట్వీట్‌పై డీకె అరుణ ఘాటుగా స్పందిస్తూ...' తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో ఫుడ్‌పాయిజన్, విద్యార్థులపై ఎలుకల దాడులు, నీరు కలుషితం కావడం వంటి వాటిపై కల్వకుంట్ల కుటుంబం దృష్టి సారించాలని అన్నారు. దురుద్దేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు ప్రధానమంత్రి వ్యాఖ్యలను తప్పుగా సూచించే ముందు, కేటీఆర్ ఓసారి ప్రధాని ప్రసంగాన్ని విని ఉండాలి' అంటూ ట్వీట్ చేశారు.
Also Read : 'గ్రీన్ సిగ్నల్'లు కాదు.. నోటిఫికేషన్లు ఇవ్వండి: రాజగోపాల్ రెడ్డి






