- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలారా.. జాగ్రత్త! రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ ప్రజలారా.. జాగ్రత్త అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బురా నర్సయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలారా.. జాగ్రత్త అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం డైవర్షన్ కింగ్ రేవంత్ రెడ్డి అంటూ ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ‘ఎందుకు సర్పంచ్ ఎన్నికలు ఆదరాబాదరగా పెట్టాడో తెలుసా? బీసీ రిజర్వేషన్ల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ప్రజల దృష్టి మొత్తం ఎన్నికలకే మళ్లేలా అసలు స్కామ్‌ని కవర్ చేసే ప్లాన్’ అని ఆరోపించించారు. ఇదిగో నిజం నిప్పులాంటి నిజం అంటూ 9292 ఎకరాలు, రూ. 6 లక్షల కోట్ల తెలంగాణ ఆస్తులు, G.O. 27 ద్వారా లూటీకి బండారం అని తెలిపారు. 7 రోజులు అప్లికేషన్, 7 రోజులు ప్రాసెసింగ్, 45 రోజుల్లో ఆర్డర్, రూ.6 లక్షల కోట్ల భూ దందాకు ఫాస్ట్ ట్రాక్ అంటూ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
ఈ ప్రభుత్వం ఆలీబాబా 40 దొంగలకు సమానం అని, ప్రతి ఒక్కరూ ఈ ఆస్తుల లూటీలో భాగస్వాములే అని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రజలారా.. మన ఆస్తిని 30% సబ్-రిజిస్ట్రార్ రేటుకి ఎవరికైనా ఇస్తారా? ఇండస్ట్రీకి ఇస్తే ఇండస్ట్రీ పెట్టాలి, పెట్టకపోతే మళ్లీ ప్రభుత్వానిదే కావాలి, కానీ ఇక్కడ ఎవరికోసం ఈ ప్రత్యేక ప్రణాళిక? జాగృతం కండి, పోరాటం చేసే సమయం ఆసన్నమైంది’ అంటూ బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు.






