- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా బిల్లు ఆమోదం అడ్డుకున్నది బీజేపీనే: ఆది శ్రీనివాస్ ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ నిరసనలకు పిలుపు నివ్వడం దుర్మార్గమైన చర్య అని, బీజేపీ నిరసన పిలుపును తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ నిరసనలకు పిలుపు నివ్వడం దుర్మార్గమైన చర్య అని, బీజేపీ నిరసన పిలుపును తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఎందుకు నిరసనలు తెలిపారు? మహిళలపైన బీజేపీకి చిత్తుశుద్ది ఉంటే మహిళా బిల్లును విడిగా పెట్టి ఉండేదని, అప్పుడు మహిళా బిల్లుకు మా ఇండియా కూటమి ఆమోదించి ఉండేదన్నారు. ఆమోదం పొందకుండా ఉండాలన్న ఆలోచనతోనే మోడీ, అమిత్ షా బిల్లు పెట్టారని, మోడీ, అమిత్ షాల ఇండ్ల ముందు బీజేపీ నాయకులు నిరసనలు తెలపాలని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
నియంతృత్వ పోకడలకు పోవడం వల్లనే మహిళా బిల్లు ఆమోదం పొందలేదని, బీజేపీ నాయకులు ముక్కు నేలకు రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలని, మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడానికి కారణం బీజేపీనే పార్టీనే అని ఆయన ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ నూకలు చెల్లాయన్నారు. అమిత్ షా, మోడీల పని అయిపోయిందని, విర్రవీగిన వారి పతనం మొదలైందని ఆది శ్రీనివాస్ విమర్శించారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గారన్నారు. ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపైన చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి, రామచంద్రరావు సమర్థించారని, తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చితే బీజేపీ నాయకులకు సిగ్గు అనిపించడం లేదా? అని ఆది శ్రీనివాస్ నిలదీశారు.






