నాడు తెలంగాణ.. నేడు బీసీ రిజర్వేషన్లు పోరాడి సాధిస్తాం: MLC Vijayashanti

by Malleboina Mahesh |   (  Updated:2025-08-06 06:39:49  IST  )

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.

నాడు తెలంగాణ.. నేడు బీసీ రిజర్వేషన్లు పోరాడి సాధిస్తాం: MLC Vijayashanti
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల (42 percent BC reservations) సాధనే లక్ష్యంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు 11 గంటలకు జంతర్ మంతర్ లో ఈ మహాధర్నా ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటలకు రాహుల్, ప్రియాంక గాంధీ ఈ ధర్నాలో పాల్గొననున్నారు. అయితే నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా ప్రారంభం అయిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Congress MLC Vijayashanti) మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీపై విమర్శలు (Criticism of BJP) చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. కేంద్ర బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను ఆమోదించే వరకు విడిచి పెట్టే ప్రసక్తే లేదని, నాడు తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామని, నేడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో చెప్పుకొచ్చారు.

Next Story