- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నా ఇల్లు.. రమ్మంటే వెళ్తాను : రాజాసింగ్ యూ టర్న్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) మరోసారి యూ టర్న్ తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. బీజేపీ(BJP) తనకు సొంత ఇల్లు లాంటిది అని, ఎప్పుడు పిలిచినా మళ్ళి వెళ్తానని పేర్కొన్నారు. గోషామహల్ కు ఉప ఎన్నిక రాదని ఆయన స్పష్టం చేసారు. కొందరు వ్యక్తులు నచ్చక తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేసానని, ఎమ్మెల్యే పదవికి చేయలేదని తెలియజేశారు. బీజేపీ నాకుం ఇల్లు వంటిదని, అధిష్టానం ఎప్పుడు పిలిచినా వెంటనే వెళతానని, పార్టీకి నావంతు సహాయం ఎప్పటికీ చేస్తానని వెల్లడించారు. తానూ ఎన్నటికీ బీజేపీ ఎమ్మెల్యేనే అని యూ టర్న్ తీసుకున్న రాజాసింగ్... తనకు వేరే పార్టీలు మ్యాచ్ అవవని అన్నారు.
తనవి కూడా కొన్ని తప్పులు ఉన్నాయని ఒప్పుకున్న ఎమ్మెల్యే... తప్పులు చేయడం మానవ సహాజం అని, వాటి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ జెండా ఎగరడం పక్కా అని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేసారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయనివ్వలేదనే కోపంతో రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.






