- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCU Land Issue : బీజేపీ విద్యార్థులను రెచ్చగొడుతోంది : అద్దంకి దయాకర్
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Issue)పై చర్చ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం(HCU Land Issue)పై చర్చ నడుస్తోంది. ఎన్నో జీవరాశులకు నివాసస్థలమైన వర్శిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని వర్శిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) స్పందించారు. హెచ్సీయూ(HCU) విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. వర్శిటీకి బీజేపీ సెంటు భూమి కూడా ఇవ్వలేదని, కాని ఇప్పుడు అవి తాము వర్శిటీకి ఇచ్చిన భూములు అన్నట్టు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.
విద్యార్థులకు నష్టం జరిగే చర్యలు ప్రభుత్వం ఎప్పటికీ చేపట్టదని ఆయన హామీ ఇచ్చారు. ఆ భూములు ప్రభుత్వానివే అనడానికి తగిన పత్రాలు ఉన్నాయని.. ఇన్నాళ్ళు ఆ భూమిపై వివాదం కోర్టులో ఉండటం వలన అది వర్శిటీ భూమిగా పొరబడుతున్నారని తెలిపారు. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని కోర్టు తీర్పు ఇచ్చిందని.. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంటుందని వివరించారు. న్యాయస్థానాలకు లోబడే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం తప్ప ఎవ్వరి భూములను లాక్కోవడం లేదని తెలియజేశారు.






