BJP Telangana : తెలంగాణలో బీజేపీదే అధికారం : శిల్పారెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణలో బీజేపీ(Telangana BJP) పార్టీపై ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి(Shilapareddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP Telangana : తెలంగాణలో బీజేపీదే అధికారం : శిల్పారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీజేపీ(Telangana BJP) పార్టీపై ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి(Shilapareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ అధికారం చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేడు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta) ప్రమాణస్వీకారం చేయడం పట్ల శిల్పారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎంగా మహిళకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా బాధ్యత మరింత పెరిగిందని, ఢిల్లీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని.. ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని ఆమె మండిపడ్డారు.

Next Story