- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నిక సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (Hyderabad MLC Election-2025) ఎన్నిక సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ ఎన్.గౌతమ్ రావు (Gautam Rao) పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాసేపట్లో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) మార్చి 24 షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్ (MS Prabhakar) పదవీ కాలం ఈ ఏడాది మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో నియోజకవర్గ పరిధిలో ఎన్నకల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4 వరకు గడువు విధించి. వచ్చిన నామినేషన్లను ఏప్రిల్ 7 వరకు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు రెండు రోజులు అంటే ఏప్రీల్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు చెపట్టి విజేతలను ప్రకటించనున్నారు.






