బీజేపీ సంచలన నిర్ణయం.. మాజీ గవర్నర్ తమిళి సైకి మరో కీలక బాధ్యతలు

by Disha Web Desk 19 |
బీజేపీ సంచలన నిర్ణయం.. మాజీ గవర్నర్ తమిళి సైకి మరో కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో డబుల్ డిపాజిట్ సీట్లే లక్ష్యంగా దూసుకోతున్న బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళి సైకి హైదరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించింది. అయితే, తమిళి సైకి తొలుత సికింద్రాబాద్ పార్లమెంట్ బాధ్యతలు ఇవ్వగా.. సమీక్ష అనంతరం ఆమెను హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్‌చార్జీగా నియమించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఆమె హైదరాబాద్ లోనే ఉండనున్నారు.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు అవసరానికి అనుగుణంగా ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ ప్రచారం నిర్వహించేలా బీజేపీ కార్యాచరణ రూపొందించింది. కాగా ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఎవరూ ఊహించన విధంగా కనీసం పార్టీ సభ్యత్వం లేని మహిళకు బీజేపీ హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంఐఎం చీఫ్, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టేందుకు విరంచి హాస్పిటల్ ఎండీ మాధవీలతను బరిలోకి దించింది. బీజేపీ వ్యూహానికి తగ్గట్లే ఆమె ఓవైసీతో హోరాహోరీగా పోరాడుతోంది. ఇదిలా ఉండగానే.. ఇప్పుడు తమిళి సైని హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌గా బీజేపీ నియమించడం హాట్ టాపిక్‌గా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed