బీజేపీకి లాభం కోసం దేశానికి నష్టం వద్దు.. డిలిమిటేషన్ పై మోడీకి రేవంత్ రెడ్డి ట్వీట్

by Prasad Jukanti |

మహిళా రిజర్వషన్ల ముసుగులో డీలిమిటేషన్ ముందుకు తీసుకురావడం సరికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి ట్వీట్ చేశారు.

బీజేపీకి లాభం కోసం దేశానికి నష్టం వద్దు.. డిలిమిటేషన్ పై మోడీకి రేవంత్ రెడ్డి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్‍తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టం అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి (Narendra Modi) ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ (Delimitation) వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. కానీ మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు.

పార్టీ కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యం:

పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యం అని డిలిమిటేషన్‍కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు. లోక్‍సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరం అని ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. ప్రత్యామ్నాయ నమూనాలను సైతం రేవంత్ రెడ్డి షేర్ చేశారు. డిలిమిటేషన్ కు జీఎస్టీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) పార్ములాను సూచించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలని 50-50 గ్రోత్ ఫార్ములాను సూచించారు.

Next Story