Sridhar Babu : బీజేపీకి ఆ హక్కు లేదు : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రధాని మోడీ కులం(PM Modi Cast Issue)పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులం, మతం ఏమిటంటూ మండిపడుతున్నారు.

Sridhar Babu : బీజేపీకి ఆ హక్కు లేదు : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రధాని మోడీ కులం(PM Modi Cast Issue)పై చేసిన వ్యాఖ్యలపై ప్రతిగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులం, మతం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఆదివారం బీజేపీ కేంద్రమంత్రులు బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి(Kishan Reddy).. రాహుల్ గాంధీ తల్లి, తండ్రీ ఒకరు క్రిస్టియన్, మరొకరు ముస్లిం అయితే ప్రస్తుతం ఆయనది ఏ కులం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ నాయకుల మాటలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీ గురించే మాట్లాడే హక్కు బీజేపీ వారికి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu). దేశప్రజలు అంతా రాహుల్ దృష్టిలో, కాంగ్రెస్ దృష్టిలో ఒకటే అని, మత ప్రాతిపదికన ప్రజలను కాంగ్రెస్ విడదీసి చూడదని అన్నారు. ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను మోసం చేస్తున్న బీజేపీ నాయకులకు.. బీసీల హక్కులు ఎందుకు గుర్తు రావడం లేదన్నారు. విషరాజకీయాలు చేస్తున్న బిజేపీకి హిందువుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కులగణన(Cast Census)పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. దేశవ్యాప్త కులగణన విషయాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ మతం తెర మీదకి తీసుకు వస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు.

Next Story