Jubilee Hills: అజారుద్దీన్‍కు మంత్రి పదవి ఆపండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

by Prasad Jukanti |   (  Updated:2025-10-30 06:38:46  IST  )

జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం మరింత రంజుగా మారింది.

Jubilee Hills: అజారుద్దీన్‍కు మంత్రి పదవి ఆపండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్‍కు (Azharuddin) మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపాలని ఈసీకీ తెలంగాణ బీజేపీ ఫిర్యాదు (BJP complaint To Election Commission చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) సమయంలో అజారుద్దీన్‍కు మంత్రి పదవి ఇవ్వడం అంటే ఓ వర్గం ఓట్లపై ప్రభావం పడుతుందని అందువల్ల జూబ్లీహిల్స్ పోలింగ్ ముగిసే వరకు అజారుద్దీన్ మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని కోరారు. ఈ మేరకు ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష డిప్యూటీ నాయడుకు పాయల్ శంకర్, బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అజారుద్దీన్‍కు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు మాకు టీవీ, పత్రిక కథనాల ద్వారా తెలిసిందని ఈ ప్రతిపాదన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందగుకు చేసిన రాజకీయ ప్రయత్నం తప్ప మరేమీ కాదని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హైదరాబాద్ అంతటా వర్తిచకపోయినా అజారుద్దీన్ కు మంత్రి పదవి ప్రకటన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఉప ఎన్నికపై ప్రభావం చూపే అవకాశం ఉందని అందువల్ల ఈ ప్రకటన జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే చేసినదిగా పరిగణించి వెంటనే ఆ ప్రకటనను ఉపసంహరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసిన విషాన్ని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రస్తావించారు.

Next Story