ఈ డ్రామా ఎన్నాళ్లు.. ఫోన్ ట్యాపింగ్‌పై వాస్తవాలు బయట పెట్టాలి : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

by Ramesh Naini |

రాష్ట్రంలో ఫోన్ ​ట్యాపింగ్ ​డ్రామా నడుస్తోందని, కేసు దర్యాప్తులో కాంగ్రెస్​, బీఆర్​ఎస్ ​కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపించారు.

ఈ డ్రామా ఎన్నాళ్లు.. ఫోన్ ట్యాపింగ్‌పై వాస్తవాలు బయట పెట్టాలి : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఫోన్ ​ట్యాపింగ్ ​డ్రామా నడుస్తోందని, కేసు దర్యాప్తులో కాంగ్రెస్​, బీఆర్ఎస్ ​కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ ఉల్లంఘన అని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే విచారణను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పర సహకారంతో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తో నష్టపోయిన ప్రజలకు న్యాయం జరగాలంటే విచారణను వేగవంతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జన నాయక్​ భారత రత్న కర్పూరీ ఠాకూర్​ జయంతి వేడుకులు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కర్పూరీ ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, పేద పిల్లల అభివృద్ధి కోసం సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపించిన మహా నేత అన్నారు. ఉచిత విద్య, రిజర్వేషన్లు, రైతు సంక్షేమం వంటి అనేక సంస్కరణలను దశాబ్దాల క్రితమే అమలు చేసిన గొప్ప దూరదృష్టి నాయకుడు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా దేశానికి సేవ చేసిన మహానుభావులను గౌరవించాలనే స్పష్టమైన విధానంతో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఠాకూర్ కు భారతరత్న పురస్కారం అందించడం దేశానికి గర్వకారణమన్నారు.

Next Story