- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డికి బీజేపీ కొత్త అధ్యక్షుడు సంచలన లేఖ
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలపై... రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తెలం

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలపై... రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తెలంగాణ కొత్త బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు (ramchander rao ). ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న రామచందర్ రావు.. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి లేఖను సీఎం రేవంత్ రెడ్డికి రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను (Six guarantees) అమలు చేసి.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఫైర్ అయ్యారు. 100 రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి.. ఇప్పుడు 20 నెలలు అయినా కూడా అమలు చేయలేదని లేఖలో విమర్శించారు. ఆరు గ్యారంటీలలో భాగంగా 63 అనుబంధ హామీలు కూడా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చి... ఇప్పుడు ఒక్కటి కూడా కాంగ్రెస్ అమలు పరచడం లేదని నిప్పులు చెరిగారు. ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి కొత్త అధ్యక్షులు రామచందర్ రావు. ఇకపై అనువణువు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ను వెంటాడుతానని తెలిపారు.






