- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారు? : రేవంత్ పై బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఫైర్
ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదని వివరించిన రామచందర్‌రావు.. అసలు ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా సోనియా, రాహుల్ గాంధీల నేషనల్ హెరాల్డ్ కేసుపై మాట్లాడుతూ.. ఇంతవరకు ఆ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు.
డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతున్నాయని, సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ తెచ్చినా ప్రజల సంక్షేమం కోసమేననీ, విపక్షాలు సంచార్ సాథీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.






