- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ది అభివృద్ధి కాదు.. అంతా అవినీతే : బీజేపీ చీఫ్ రామచంద్రరావు
మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడంపై తమ పోరాటం ఆగదన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు.

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. కానీ.. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటామని తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ.. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రూ.7000 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకుండా.. పేదల ఇళ్లను కూలగొట్టడం సరికాదన్నారు. దీనిని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. మూసీ పక్కన ఉన్న అక్రమ కట్టడాలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. పేదల పక్షాన ఎవరూ లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
హైదరాబాద్ నగరం సుందరీకరణ కావాలి కానీ.. అది పేదల ఇళ్లను, వారి జీవితాలను దెబ్బతీసేలా ఉండకూడదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ రూ.లక్షన్నర కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి దానిని మూసేశ్వరంగా మారుస్తున్నారని విమర్శించారు. చివరికి తెలంగాణను అభివృద్ధి చెందకుండా మూసేస్తారని దుయ్యబట్టారు. ఇక ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ రంగ నిపుణులు వెదిరె శ్రీరామ్ ప్రజల ఇళ్ల కూల్చివేతలపై కొన్ని ప్రత్యామ్నాయాలను వివరించారు. మూసీనదిలో కాలుష్యం, డ్రైనేజీ వ్యర్థాలు కలవకుండా శుద్ధిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మూసీనీటి నుంచి రైతులు స్వచ్ఛమైన పంటలను పండించినపుడు మూసీ పునరుజ్జీవం సక్సెస్ అయినట్లుగా భావించాలన్నారు. సిటీ ఏరియాలో మాత్రమే శుద్ధి చేస్తే పైనుంచి వచ్చే సీవరేజ్ అంతా ఎక్కడికి పోతుందన్న ఆలోచన లేకుండా ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.






