- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం పేదల కోసం గొప్ప పథకాలు తీసుకొచ్చింది: బీజేపీ చీఫ్ రాంచందర్రావు
మానవ కృషితో పాటు, దైవ అనుగ్రహం అవసరమని, గత అనేక సంవత్సరాలుగా కార్యకర్తల కృషితో బిజెపి పార్టీ నిర్మాణం సుస్థిరమైందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మానవ కృషితో పాటు, దైవ అనుగ్రహం అవసరమని, గత అనేక సంవత్సరాలుగా కార్యకర్తల కృషితో బిజెపి పార్టీ నిర్మాణం సుస్థిరమైందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు పేర్కొన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతితో పాటు ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం, దేశాన్ని వికసిత్ భారత్'గా మార్చడం లక్ష్యంగా మోడీ ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. విశ్వకర్మలను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్’ గా భావిస్తామని వారు నిర్మించిన చారిత్రక భవనాలు ,స్మారకాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. విశ్వకర్మ కౌశల్ యోజన ద్వారా విశ్వకర్మలకు మేలు చేసేలా మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గొప్ప పథకాన్ని అమలు చేస్తోందన్నారు. విశ్వకర్మలను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్’గా మోడీని డెవలప్డ్ ఇండియా ఆర్కిటెక్ట్’గా ప్రత్యేకంగా అభివర్ణించవచ్చన్నారు. ఆయన సేవలు, నాయకత్వాన్ని గౌరవిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.
ప్రధాని మోడీ విప్లవాత్మక ప్రపంచ నాయకుడు పుస్తకావిష్కరణ :
దేశ ప్రధాని మోడీ విప్లవాత్మక ప్రపంచ నాయకుడు అనే త్రిభాషా పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన ఈ పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సిద్ధమైంది. మోడీ రాజకీయ ప్రస్థానం, ఆర్థిక సంస్కరణలు, సామాజిక న్యాయం పట్ల కట్టుబాటు, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట, గ్రామీణాభివృద్ధి దిశగా చేసిన కృషి వివరించారు. పుస్తకావిష్కరణ అనంతరం ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి. మోడీ 75 ఏళ్ల జీవన యాత్ర దేశానికి స్ఫూర్తిదాయకం.
వెనుకబడిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఈ పుస్తకం మోదీ నాయకత్వాన్ని అధ్యయనం చేయదలచిన వారికి విలువైన ఆధారం అవుతుందన్నారు. అనంతరం డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ మోడీ కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఒక దార్శనికుడు, ఒక యోగి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనానికే అంకితమన్నారు. వెనుకబడిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. బలహీన వర్గాలకు అండగా నిలిచి, సంక్షేమం, అభివృద్ధి, సమానత్వం అనే మూడు సూత్రాలను ఆయన పాలనలో సమన్వయం చేశారు.






