'మేము గెలవమని ముందే తెలుసు...' : బీజేపీ చీఫ్ రామచందర్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |   (  Updated:2025-11-14 05:37:29  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యంలో దుసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది.

మేము గెలవమని ముందే తెలుసు... : బీజేపీ చీఫ్ రామచందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యంలో దుసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది. అయితే ఈ లెక్కింపు ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. తాము ఈ ఎన్నికల్లో గెలవమని ముందే తెలుసని హాట్ కామెంట్స్ చేసారు. కేవలం ప్రాతినిధ్యం వహించడానికే తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో బీజేపీకి 2,167 ఓట్లు రాగా.. తరువాతి రౌండ్స్ లో పూర్తిగా వెనకబడిపోయింది. అలాగే ఓట్ల లెక్కింపు వద్ద ఆ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవరూ లేకపోవడం గమనార్హం.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఐదో రౌండ్‌కు 12700 ఓట్ల లీడ్

Next Story