- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ, బీఆర్ఎస్.. టీపీసీసీ నేత సామా ట్వీట్
ఫేక్ వీడియోలను పోస్ట్ చేసి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మళ్లీ అడ్డంగా దొరికిపోయారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఫేక్ వీడియోలను పోస్ట్ చేసి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మళ్లీ అడ్డంగా దొరికిపోయారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి (TPCC Media Committee Chairman Sama Rammohan Reddy) అన్నారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారం (HCU Land Dispute) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కంచె గచ్చిబౌలి భూముల్లో (Kanche Gachibouli Lands) ప్రభుత్వం చెట్లను తొలగిస్తూ.. పర్యావరణానికి విఘాతం కలిగిస్తుండటంతో ఆ ప్రాంతంలోని పక్షులు (Birds) ఆర్తనాదాలు చేస్తున్నాయని ఓ వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) గా మారింది.
దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో ఇదేనని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సామా.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ (BJP), బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) అంటూ.. మరీ ఇంత దిగజారిపోవడమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెమలుల అరుపుల సౌండ్‌ను జేసీబీ పనుల వీడియోకి జత చేసి.. నెమలుల ఆర్తనాదాలంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ దొందు పార్టీల నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఇక అబద్ధాన్ని ఎలాగైనా ప్రజలకి నమ్మించాలని అసలు చిత్రాలు లేక.. ఏఐ చిత్రాలని నమ్ముకొని పోస్టులు చేస్తున్న బ్రదర్ పార్టీస్ నాయకులు అని, నిజం దాగదు.. మీరు దొరికిపోక తప్పదు అని సామా ఎక్స్ లో రాసుకొచ్చారు.






