BJP: ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ కీలక సమావేశం.. ఆ పార్టీతో టఫ్ ఫైట్ తప్పదా!

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC elections)‌పై ప్రధానంగా బీజేపీ (BJP) ఫోకస్ పెట్టింది.

BJP: ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ కీలక సమావేశం.. ఆ పార్టీతో టఫ్ ఫైట్ తప్పదా!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC elections)‌పై ప్రధానంగా బీజేపీ (BJP) ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మధ్యా్హ్నం నాంపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన మధ్యహ్నం 12 గంటలకు సమావేశం నిర్వహిచానున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు (Gautham Rao)తో పాటు బీజేపీ కార్పొరేటర్లు (BJP corporators), ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. సమావేశంలో ప్రధానంగా ఈనెల 23న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఓటింగ్‌కు కార్పొరేటర్లు గైర్హాజరు అవ్వకుండా కిషన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, అధికార కాంగ్రెస్ తాము పోటీకి దూరం అంటూ ప్రకటిస్తూనే.. ఎంఐఎంకు సూత్రప్రాయంగా మద్దతు తెలిపినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు బీఆర్ఎస్ పోటీ చేయట్లేదని ఇప్పటికే ప్రకటించింది. అయితే, గెలిచేందుకు సరిపడా బలం లేకపోయినా.. బీజేపీ తమ అభ్యర్థిని పోటీలోకి దింపడం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 112 ఓట్లు ఉండగా.. అందులో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్‌ఎస్‌కి 24, అధికార కాంగ్రెస్‏కు 14 మంది ఓటర్లున్నారు. ఈ క్రమంలోనే తమ గెలుపు ఖాయమని ఎంఐఎం ధీమా వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ గ్రౌండ్ లెవెల్‌లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) సభ్యుల మద్దతును కూడగట్టే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి సపోర్ట్ ఎవరికనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలింగ్ సమీపిస్తున్నా.. నేటికీ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ అధినాయకత్వం కార్పొరేటర్లతో సమావేశం కాకపోవడం, తమ మద్దతు ఎవరికి అనే విషయం‌పై క్లారిటీ ఇవ్వకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ (BRS), కాంగ్రెస్‌ (Congress) కార్పొరేటర్లను కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ క్రాస్ ఓటింగే జరిగితే.. బీజేపీ గట్టె్క్కుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు.

Next Story