BJP: ప్రారంభమైన "బీజేపీ మూసీ నిద్ర".. తులసీరామ్ నగర్‌లో కేంద్రమంత్రి బస

by Ramesh Goud |

మూసీ పరివాహక ప్రాంతాల్లో(Moosi Catchment Areas) "బీజేపీ మూసీ నిద్ర"("BJP Moosi Nidra") కార్యక్రమం ప్రారంభమైంది(Started).

BJP: ప్రారంభమైన బీజేపీ మూసీ నిద్ర.. తులసీరామ్ నగర్‌లో కేంద్రమంత్రి బస
X

దిశ, వెడ్ డెస్క్: మూసీ పరివాహక ప్రాంతాల్లో(Moosi Catchment Areas) "బీజేపీ మూసీ నిద్ర"("BJP Moosi Nidra") కార్యక్రమం ప్రారంభమైంది(Started). ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు(BJP Leaders) మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అనంతరం మూసీ నది వెంట 21 ప్రాంతాల్లో వారు రాత్రి బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీ రామ్ నగర్(Tulsiram Nagar) లోని మూసీ ప్రాంత ప్రజలను కలిసి, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.

అనంతరం ఈ రాత్రి తులసీరామ్ నగర్ లోనే కిషన్ రెడ్డి బస చేయనున్నారు. ఆయన వెంట బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ(Rani Rudrama) సహా ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ ప్రక్షాళన పై మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మూసీపై రాద్ధాంతం చేస్తున్నారని, మూసీ ప్రాంత ప్రజల కష్టాలు తెలియాలంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నాయకులు బస చేయాలని సూచించారు. ఈ మాటలను ఛాలెంజ్(Challenge) గా తీసుకున్న బీజేపీ లీడర్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక రోజు రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు.

Next Story