- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bird Flu : హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం
హైదరాబాద్(Hyderabad) లో బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం రేగింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం రేగింది. నగర శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్దారణ జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్(Abdullapur met) మండలంలో బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. గత నాలుగు రోజులుగా అక్కడి ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో వేల కోళ్లు చనిపోగా... అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. కాగా నేడు అది బర్డ్ ఫ్లూ అని తేలడంతో పౌల్ట్రీ ఫామ్స్ యజమానులు బెంబేలెత్తి పోతున్నారు. ఎండల వలన అవి చనిపోయాయి అనుకొని కల్లింగ్ ప్రాసెస్ కూడా సరిగా చేయలేదని భయపడుతున్నారు. దీంతో పౌల్ట్రీలో పనిచేస్తున్న వారందరి శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు.
ఈ వార్త బయటికి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయంతో వణికి పోతున్నారు. కాగా ఆ ఏరియాను రెడ్ జోన్(Red Zone) గా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నల్గొండ(Nalgonda) జిల్లా గుండ్రాంపల్లి, దోతిగూడెంలోని 3 పౌల్ట్రీ ఫామ్స్ లో బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆయా ఫామ్స్ లో ఉన్న కోళ్లను జాగ్రత్తగా పూడ్చి పెట్టించిన అధికారులు.. ఆ ఏరియాలో 5 కిమీల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు.






