- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ ఏ పదవి ఇచ్చినా రెడీ.. కేటీఆర్ కూడా.. గంగవ్వ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఏ పదవి ఇచ్చినా చేసేందుకు రెడీగా ఉన్నట్లు బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ (Gangavva) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనకు ఏ పదవి ఇచ్చినా చేసేందుకు రెడీగా ఉన్నట్లు బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ (Gangavva) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ చానల్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరైన గంగవ్వ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, మరోవైపు తన జీవితం గురించి ఎవరికీ తెలియని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా? అని యాంకర్ గంగవ్వను ప్రశ్నించగా.. రేవంత్ రెడ్డిని గతంలో కలిసినట్లు తెలిపారు. దండం పెట్టబోతుంటే వద్దు అవ్వా.. అని అన్నారని గంగవ్వ సమాధానం ఇచ్చింది. గతంలో సీఎం తన ఊరి పక్క గ్రామానికి విజిట్ చేశారని, ఆ సమయంలో రేవంత్ రెడ్డికి మిరపకాయ బజ్జీలు చేసి పెట్టానని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా పదవి ఇస్తే చేస్తారా? అని యాంకర్ గంగవ్వను ప్రశ్నించగా.. తప్పకుండా చేస్తానని గంగవ్వ తన మనసులో మాట బయట పెట్టారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్ (KTR), సీఎం రేవంత్ రెడ్డి అందరూ తెలంగాణ బిడ్డలేనని కొనియాడారు. అదేవిధంగా తను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను సైతం కలిసినట్లు చెప్పుకొచ్చారు. మామిడి తోటలో తన టీమ్‌తో కలిసి కేటీఆర్ నాటుకోడి దావత్ చేసుకున్నట్లు గుర్తుకు చేశారు. కేటీఆర్ కూడా ఏదైనా పని చేయమంటే కచ్చితంగా చేసి పెడతానని చెప్పారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు గంగవ్వ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె వెలుగులోకి వచ్చారు.
బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఆమె సందడి చేశారు. తెలంగాణ బాష, యాస ద్వారా ఆమె ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 2019లో వచ్చిన మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె చాలా సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం ఆమె నటించి మెప్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గతంలో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో పాటు గంగవ్వ ఎన్నో అవార్డులు పొందారు.






