కాళేశ్వరం నివేదికపై బిగ్ అప్డేట్

by Muthe.Rajitha |

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్(PC Ghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది.

కాళేశ్వరం నివేదికపై బిగ్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్(PC Ghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్(Kaleswaram Commission) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదికను రేపు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. రేపు ఉదయం ప్రభుత్వానికి నివేదిక అందితే.. రేపటి కేబినెట్ సమావేశంలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫలితంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

ఈ విచారణలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటికే, విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఈ రెండు నివేదికలు తెలంగాణ ప్రభుత్వం గత పాలనలో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందని సమాచారం.

Next Story