TG: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై BIG అప్డేట్

by Gantepaka Srikanth |

విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే లోపు చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది.

TG: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై BIG అప్డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే లోపు చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటివరకు ఉన్న బకాయిలు ఎన్ని? ఏ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ముందుగా చెల్లించాలి? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. గతేడాది బకాయిలు రావాల్సి ఉన్నదని, ఆ ఫీజు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ప్రతిసారీ షరతులు పెడుతున్నాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు రావొద్దని పరీక్షా ఫలితాలు వచ్చేలోపు బకాయిలు చెల్లించేలా ఏర్పాట్ల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

మెజార్టీ సంస్థలో బీఆర్ఎస్ లీడర్లవే..

అయితే ఇప్పటి వరకు దాదాపు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్టు సమాచారం. ఇందులో ముందుగా ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుంటోన్న స్టూడెంట్స్‌కు చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందే లిస్టులో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు, ఎమ్మెల్యేల డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలు ఉన్నట్లు ప్రచారం ఉంది. బీఆర్ఎస్ హయంలో ప్రస్తుత ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీజు బకాయిల చెల్లింపులో ఓ రింగ్ నడిపే వారని విమర్శలు ఉండేవి. ఆయన చెప్పిన కాలేజీలకే ముందుగా చెల్లించేవారని ఆరోపణలు ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి వివక్ష లేకుండా విడతల వారిగా అన్ని కాలేజీలకూ బకాయిలు చెల్లించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Next Story