- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ‘రాజీవ్ యువ వికాసం’ అప్‌డేట్
తెలంగాణ సర్కార్(Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్(Rajiv Yuva Vikasam Scheme)పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక అప్డేట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్(Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్(Rajiv Yuva Vikasam Scheme)పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ స్కీమ్‌పై మంగళవారం సెక్రటేరియట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే జూన్ 10వ తేదీ నుంచి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. అలాగే జూన్ 15వ తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీ నుంచి 5 లక్షల మంది యువతకు దశల వారిగా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. తొలి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సమీక్షలో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఇదిలా ఉండగా.. రూ. 50 వేల నుండి రూ.4 లక్షల వరకు రాజీవ్ యువ వికాసంలో 80శాతం వరకు సబ్సిడీతో రుణాలందజేయనున్నారు. రూ.1 లక్ష వరకు 80 శాతం సబ్సిడీ, రూ. 1లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 70శాతం, రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు 60శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. రూ.50వేల రుణంపై వంద శాతం సబ్సిడీ ఇస్తున్నారు. రూ.50 వేలు రుణం పొందిన వారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.






