TG: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై BIG అప్డేట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-26 14:34:50  IST  )

స్థానిక సంస్థల ఎన్నికలకు(Telangana Local Body Election) తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది.

TG: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై BIG అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలకు(Telangana Local Body Election) తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం(Election Commission) సమావేశం నిర్వహించనుంది. అదే రోజున సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్‌ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్‌ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్‌ అధికారుల నుంచి చెక్‌పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీవోలు ఖరారు చేశారు. గురువారం రాత్రే పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్టు సమాచారం.

Next Story