ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. ప్రభాకర్ రావు సరెండర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-12 05:38:48  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. ప్రభాకర్ రావు సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో ఇవాళ సిట్ అధికారుల ఎదుట బేషరుతగా లొంగిపోవాలని ధర్మాసనం తెలిపింది. దీంతో ఇవాళ ప్రభాకర్ రావు ఉదయం సరిగ్గా 10.30కి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొగిపోయారు. ఈ మేరకు ఆయనను సిట్ అధికారులు అదపులోకి తీసుకున్నారు. మరోవైపు గురువారం విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావును వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు కోర్టు అనుమతించింది. అయితే, ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడదని దర్యాప్తు బృందానికి ధర్మాసనం ప్రత్యేకంగా సూచించింది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. కేసుతో ముడిపడి ఉన్న ఐఫోన్‌కు సంబంధించి క్లౌడ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను అన్నింటినీ రీసెట్ చేసి, సమాచారం ఇవ్వట్లేదని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో కేసులో అంతకు ముందు ఆయనకు ఇచ్చిన మధ్యంతర అరెస్ట్ నుంచి ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ.. సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagaratna), జస్టిస్ ఆర్ మహదేవన్ (Justice R Mahadevan) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు కోర్టు నిందితుడు ప్రభాకర్ రావును రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బేషరతుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story