- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ పర్వం కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ పర్వం కొనసాగుతోంది. ఫోన్లు ట్యాంపింగ్‌కు గురైన వారిని గుర్తించి సిట్ ఇప్పటికే గుర్తించింది. ఇప్పటికే వారికి దశల వారీగా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేస్తూ వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం వాటిలో ఉన్న డేటా అత్యంత కీలకంగా కానుందని తెలుస్తోంది. ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్‌ఎల్ (FLS)కు పంపారు. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ నెల 14న మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు సమాచారం అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






