- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అప్డేట్

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu) లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) బిగ్ అప్డేట్ ఇచ్చింది. లబ్ధిదారులకు రూ.20.19 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకు బేస్‌మెంట్ నిర్మించుకున్న 2,019 మంది అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వయంగా చెక్కులు అందించారు. ఇదిలా ఉండగా.. గత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసింది. పలు చోట్ల ఇండ్ల నిర్మాణాలు సైతం ప్రారంభమై.. బేస్మెంట్ వరకు పూర్తిచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్కీమ్ అమలులో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతున్నది. ఇందులో భాగంగానే ఇటీవల కొత్త గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఈ మార్గదర్శకాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని సూచించింది. పొరపాట్లకు తావులేకుండా నిర్మాణాలు ఉండాలని.. లేదంటే బిల్స్ నిలిపివేస్తామని హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ హెచ్చరికలు సైతం జారీ చేశారు. కాగా, తొలి విడతలో ఇంటి స్థలమున్న వారికి మాత్రమే ప్రాధాన్యతనివ్వగా.. రెండో విడత లబ్ధిదారుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.
గైడ్‌లైన్స్ ఇలా..
- ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్‌మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫొటో తీయాలి.
- ఆ ఫొటోను ఇందిరమ్మ యాప్‌లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి.
- ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి.
- రెండు గదులు, ఒక వంటగది, బాత్ రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి.
- ప్రతి దశలోనూ ఫొటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
- వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి.
- పాత ఇంటిని ఆనుకొని గానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులుగా గానీ, కొంతవరకు కూల్చి వేసిన వాటికిగానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు.
- గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు.
- ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు.
- ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి.