ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ సుప్రీం కోర్టుకు ప్రభాకర్ రావు

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ సుప్రీం కోర్టుకు ప్రభాకర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చెపట్టిన సుప్రీంకోర్టు విచారణను 4వ తేదికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఇంటిరియమ్ ప్రోటెక్షన్ తో జూన్ 9 వతేదిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హజరయ్యారు. ఇప్పటి వరకు 6 సార్లు ప్రభాకర్ రావు విచారణకు సిట్ అధికారులు పిలిచారు. ప్రభాకర్ రావు కు సంబంధిచిన ఫోన్ , ల్యాప్ టాప్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయంలో సిట్ అధికారులను వివరణ కోరగా మాకు తెలియాదని సమాధానం తెలిపారు.

ఇంటీరియమ్ ప్రోటెక్షన్ రద్దుకు సిట్ పిటిషన్

ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటిరియమ్ ప్రోటెక్షన్ వల్లే విచారణకు సహకరించడం లేదని సిట్ అధికారులు తెలుపుతున్నారు. ఇంటిరియమ్ ప్రోటెక్షన్ రద్దు చేసి సీట్ కస్టడికి ఇవ్వాలని కోరుతో జూలై 11 వ తేదిన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటిరియమ్ ప్రోటెక్షన్ ఆగస్టు 5వ తేదితో ముగియనుంది. ఆగస్టు 4 వ తేదిన సుప్రీంకోర్టు విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇంటిరియమ్ ప్రోటెక్షన్ తో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదని సిట్ అధికారులు ఉన్నతాధికారులకు, సుప్రీకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కోన్నారు.

Next Story