- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే లవర్స్ డే.. సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రేమికులకు BIG షాక్
ప్రేమికులకు ఫిబ్రవరి 14(Valentine's Day) అతి పెద్ద పండగ అనే సంగతి అందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమికులకు ఫిబ్రవరి 14(Valentine's Day) అతి పెద్ద పండగ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున వారి వారి ప్రత్యేకమైన మనుషులకు బహుమతులు ఇస్తూ.. సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇష్టమైన ప్రాంతాలకు తీసుకెళ్లి.. ఆ ఒక్కరోజు వారితో ఆనందంగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే లవర్స్(Lovers) అంతా పార్కులు, ఆలయాలు, సినిమాలకు వెళ్తుంటారు. అయితే.. అనూహ్యంగా లవర్స్ డేకు సరిగ్గా ఒక్క రోజు ముందు బజరంగ్‌దళ్(Bajrang Dal) నాయకులు భారీ షాకిచ్చారు. ప్రేమికుల రోజును నిషేధించాలని ప్రకటించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ కాచిగూడలోని ఆ సంస్థ రాష్ట్ర కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు.
వాలంటైన్స్ డే(Valentine's Day) పేరిట పబ్బుల్లో, హోటళ్లలో, పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ సంస్థ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగర వ్యాప్తంగా పలు పబ్బుల్లో యువతను ప్రేమికుల రోజు ఆఫర్ల పేరిట ఆకర్షిస్తున్నారు. ఇది మన సంస్కృతి కాదు. ప్రేమికుల రోజు వేడుకల్ని బ్యాన్ చేయాలి. ఎవరైనా లవ్ పేరిట బయట విచ్చలవిడిగా తిరిగితే ఊరుకోము. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని వదిలి పెట్టము’ అని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






