కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్! వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ కీలక ఆదేశాలు

by Sathputhe Rajesh |

హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది.

కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్! వివాదాస్పద వ్యాఖ్యలపై ఈసీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఈసీ బుధవారం ఆదేశించింది. ఇక, కౌశిక్ రెడ్డి ప్రచారం ముగింపు రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి తనను గెలిపించకపోతో భార్య, బిడ్డతో కలిసి ఉరేసుకుంటానన్నారు. గెలిస్తే విజయ యాత్ర, లేదంటే డిసెంబర్ 4న తన శవయాత్ర అంటూ ఓటర్లను ప్రభావితం చేసేలా కామెంట్స్ చేశారు.

Next Story