టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్‌.. ఉప్పల్ స్టేడియంలో పేరు తొలగింపు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్‌.. ఉప్పల్ స్టేడియంలో పేరు తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఉప్పల్‌ స్టేడియంలో నార్త్‌ స్టాండ్‌కు ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌(Azharuddin) పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం HCAకు అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్‌ క్రికెట్‌ క్లబ్‌ వేసిన పిటిషన్‌పై అంబుడ్స్‌మన్‌ విచారణ నేపథ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్ HCA ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు.

కాగా, ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యాల మధ్య ఉచిత పాస్‌ల కేటాయింపుపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. పాత ఒప్పందం ప్రకారం.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యంలో 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను HCAకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు SRHకు పూర్తి సహకారం అందిస్తామని HCA హామీ ఇచ్చింది. ఈ చర్చల అనంతరం.. వివాదాలు ముగిసినట్లు SRH, HCA సంయుక్తంగా ప్రకటించాయి. ఇది గడిచిన రెండు వారాలకే మరోసారి హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story