- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి బిగ్ షాక్..వ్యతిరేక గళం విప్పిన సీనియర్లు
పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. సొంత పార్టీ నేతలే నియోజకవర్గం ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి

దిశ, వెబ్ డెస్క్: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. సొంత పార్టీ నేతలే నియోజకవర్గం ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో పార్టీలోని సీనియర్లు అంతా ఒక్కటై ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలిపే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఝాన్సీరెడ్డి అధ్యక్షతన ఎన్నికలకు వెళితే డిపాజిట్లు కూడా రావని ఆందోళన వ్యక్తం చేశారు. ఝాన్సీరెడ్డి కారణంగా అసలైన కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసేందుకు నేతలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో గాంధీ భవన్ వద్దకు వెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.






