- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
గులాబీ పార్టీలో కలకలం.. సీఎంను కలిసిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

దిశ, వెబ్‌డెస్క్ : ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలీ గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్న ఈ తరుణంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారిద్దరు నియోజకవర్గ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నా.. గత కొంతకాలంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతారనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు తగ్గపోరుగా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న వేళ వీరిద్దరు సీఎంను కలవడం గులాబీ పార్టీ కలవరపాటుకు గురవుతుంది. మరోవైపు వీరిద్దరు పార్టీ మారే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. మరి ఈ అంశంపై ఆ ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.