జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

by Gantepaka Srikanth |

ఏ ఎన్నిక వచ్చినా ఇక బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదు.. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏ ఎన్నిక వచ్చినా ఇక బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదు.. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురళి గౌడ్, మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అన్నారు.

మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేశారని, బనకచర్ల విషయంలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఉంచేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన జరుగుతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Next Story