- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబులకు BIG షాక్.. హోలీ రోజున వైన్స్‌షాపులు బంద్..!
హోలీ పండుగ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రంగులతో పాటు దావత్. మధ్యాహ్నం వరకు రంగులు పూసుకొని హోలీ ఆడిన అందరూ సాయంత్రానికి చిల్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: హోలీ పండుగ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది రంగులతో పాటు దావత్. మధ్యాహ్నం వరకు రంగులు పూసుకొని హోలీ ఆడిన అందరూ సాయంత్రానికి చిల్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే, అలా చిల్ అయ్యే ఛాన్స్ లేకుండా పోలీసులు అనూహ్య షాకిచ్చారు. హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా హోలీ పండుగరోజున వైన్స్ షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఆరోజు నగరంలో పలు ఆంక్షలు విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఇవాళ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని.. సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదని హెచ్చరించినట్లు సమాచారం. వాహనాలపై పబ్లిక్ రోడ్స్‌లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని తెలిపారు.






