- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1: గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సంచలన నిర్ణయం
గ్రూప్-1 విషయంలో టీజీపీఎస్సీ, ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు భారీ ఊరట లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 వివాదంలో (Group-1) టీజీపీఎస్సీ (TGPSC), ర్యాంకర్లకు హైకోర్టు డివిజన్ బెంచ్ లో భారీ ఊరట లభించింది. గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ నెల 9న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బెంచ్ గ్రూప్-1 ఫలితాలు, జనరల్ ర్యాంకుల కేటాయింపును రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు జనరల్ ర్యాంకింగ్ సాధించిన అభ్యర్థి అప్పీల్ చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ఇవాళ విచారణ జరిపిన సీజే అపరేష్ కుమార్ సింగ్ తో (CJ AK Singh)కూడిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. తుది తీర్పునకు లోబడి తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది.
ఆన్సర్ షీట్స్ చూడకుండా మూల్యాంకనం ఎలా తప్పుపడతారు?:
విచారణ సందర్భంగా టీజీపీఎస్సీ తరఫున ఏజీ ఎ.సుదర్శన్ రెడ్డి (AG Sudarshan Reddy) వాదనలు వినిపిస్తూ 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఇన్నేళ్ల తర్వాత జరుగుతున్న నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసిందన్నారు. తెలుగు అభ్యర్థుల పట్ల పక్షపాతం చూపించారనడానికి ఆధారాలు లేవని ఆరు ఆరు ఆరోపణల ఆధారంగా సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిందని ఈ ఆరోపణలకు ఎవరూ ఆధారాలు చూపించలేకపోయారని ఏజీ వాదిచారు. దీంతో మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ ఘటనలేమైనా జరిగాయా? పక్షపాతం చూపించారనడానకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కమిషన్ రూల్స్ ను ఉల్లంఘించినట్లు ఆధారాలు ఉన్నాయా అని సీజే ప్రశ్నించారు. కమిషన్ ఎక్కడా రూల్స్ ఉల్లంఘించలేదని ఏజీ తెలిపారు. ఏపీ గ్రూప్-1 లోనూ తెలుగు అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని తెలిపారు. కోఠి మహిళా వర్సిటీలో పురుషులకు మూత్రశాలలు లేవని అందుకే ఆ రెండు కేంద్రాలను మహిళలకే కేటాయించామని ఏజీ తెలిపారు. దివ్యాంగులకు సమీపంలో ఉన్న కేంద్రాలను కేటాయించామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు జారీని కూడా తప్పుపట్టారని కోర్టుకు వివరిచారు. దీంతో పరీక్షా కేంద్రాల కేటాయింపును తప్పుపట్టలేమని, హాల్ టికెట్లు జారీ లోనూ టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని సీజే తెలిపారు. నిబంధనల ప్రకారం మూల్యాంకనం జరగలేదని ఎంపిక కాని అభ్యర్థుల న్యాయవాదుల వాదన పట్ల స్పందించిన సీజే జవాబు పత్రాలు చూడకుండా మూల్యాంకనం సరిగ్గా జరగలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ వాయిదా వేసింది.






