- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త పార్టీపై హైకోర్టులో కవితకు BIG రిలీఫ్
కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' నమోదుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఆదేశం.

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త రాజకీయ పార్టీ నమోదు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. తెలంగాణ ప్రజా జాగృతిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‍కు సూచించింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు ఎన్నికల కమిషన్ చెప్పగా లోపాలన్నీ సరిచేసినట్లు తాజాగా కవిత తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులు సరిచేసి ఈసీకి మళ్లీ దరఖాస్తు చేశామని కోర్టుకు వివరించారు. ఈసీ స్పందిస్తూ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈసీ త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో కోర్టు విచారణ ముగించింది.






