- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalpika Ganesh: సినీ నటి కల్పికకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..
వివాదాలకు మారుపేరుగా మారిన సినీ నటి కల్పిక గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: వివాదాలకు మారుపేరుగా మారిన సినీ నటి కల్పిక గణేష్ (Kalpika Ganesh)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ప్రిజం పబ్ కాంప్లిమెంటరీ విషయంలో తనపై నమోదైన రెండు కేసుల్లో అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ప్రిజం పబ్ (Prism Pub) మేనేజింగ్ పార్ట్‌నర్ దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు (Gachibowli police station) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు.. అలాగే సోషియల్ మీడియా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని పబ్ ఓనర్ ప్రణీత్ సోదరి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ హైద్రాబాద్‌లో నటి కల్పికపై మరో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లో తనను అరెస్టు చేయొద్దని.. కోర్టులో కల్పిక లాయర్ జక్కల లక్ష్మణ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న తర్వాత.. కల్పిక గణేష్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే నటికి, పబ్ సిబ్బందికి మధ్య కాంప్లిమెంటరీ విషయంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక పబ్‌లో హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే తను సిబ్బంది, మేనేజర్‌తో ప్రవర్తించిన తీరుపై ఆమెపై గత నెలలో కేసు నమోదు అయింది. ఇదిలా ఉండగా ఇటీవల నగర శివారులోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల బ్రౌన్‌టైన్ రిసార్ట్‌లో నటి కల్పిక సృష్టించిన హంగామా సైతం చర్చనీయాంశంగా మారింది.






