- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు
బండి సంజయ్‍పై నమోదైన ఎఫ్ఐఆర్‍ను హైకోర్టు క్వాష్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్‍కు (Bandi Sanjay) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) భారీ ఊరట లభించింది. తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందంటూ 2023లో హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. బండి సంజయ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది. గత బీఆర్ఎస్ హాయంలో 2023లో జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్షల సమయంలో హిందీ ప్రశ్నా పత్రం లీక్ (Hindi Question Paper Leakage) కావడం కలకలం రేపింది. ఈ లీకేజీలో బండి సంజయ్ ప్రమేయం ఉందని ఆయనపై IPC సెక్షన్లు 120-B, 420, 447, 505(1)(b), తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్) యాక్ట్, 1997 లోని సెక్షన్లు 4(A), 6 r/w 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66D కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అప్పట్లో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు సైతం చేశారు. ఈ కేసుపై తాజాగా ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్‍కు ఉపశనమం కలిగిస్తూ ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది.






