- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: ట్విన్ సిటీస్ పబ్లిక్‌కు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్‌కార్డులకు వచ్చే నెల నుంచి రేషన్
జంట నగరాల పరిధిలో ఇటీవల ప్రభుత్వం 1.54 లక్షల తెల్ల రేషన్‌కార్టులను మంజూరు చేసి విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జంట నగరాల పరిధిలో ఇటీవల ప్రభుత్వం 1.54 లక్షల తెల్ల రేషన్‌కార్టులను మంజూరు చేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ (State Civil Supplies Department) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అయితే, జులైలో మొదటి దశగా కార్డులు జారీ చేసిన సర్కార్ ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులను మంజూరు చేసింది. నగర వ్యాప్తంగా సుమారు 6 లక్షల దరఖాస్తులు రాగా 1,54,276 కుటుంబాలను అర్హులుగా గుర్తించి కార్డులను జారీ చేశారు. అయితే, ఈ కార్డుల ద్వారా 5.77 లక్షల మందికి లబ్ధి కలగనుంది. కొత్తగా మంజూరైన కార్డులకు నవంబరు నుంచి రేషన్ పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త కార్డులకు 3,463 టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేశారు.
కాగా, హైదరాబాద్ (Hyderabad) జిల్లాలో మొత్తం 64,179 రేషన్ కార్డులపై 2,80,640 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 1,683 టన్నుల సన్నం బియ్యం పంపిణీ చేయనున్నారు. మేడ్చల్ (Medchal) జిల్లాలో మొత్తం 45,649 రేషన్ కార్డులపై 1,49,081 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 894 టన్నుల సన్నం బియ్యం అవసరం పడతాయి. రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలో మొత్తం 44,448 రేషన్ కార్డులపై 1,47,765 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 886 టన్నుల సన్నం బియ్యాన్ని పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
READ MORE ......






