- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతలకు భారీ గుడ్‌న్యూస్.. రైతు యాంత్రీకరణ పథకం పున:ప్రారంభం
రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageshwar Rao) గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farmer Mechanization Scheme) తిరిగి ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇవాళ సచివాలయంలో మంత్రి తుమ్మల రైతుల సంక్షేమానికి సంబంధించి వ్యవసాయ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా తిరిగి ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు అందజేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.
ఇక రైతు భరోసా కార్యక్రమం కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ (Satellite Image Mapping) పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మ్యాపింగ్ ద్వారా రైతులకు మరింత ఖచ్చితమైన పెట్టుబడి సహాయం అందేలా చూడాలని సూచించారు. అలాగే, అయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పంట ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. సేంద్రియ వ్యవసాయం పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా మంత్రి సూచించారు. సేంద్రియ విధానాల ద్వారా పంటల నాణ్యత పెరిగి, మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని రైతులకు తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు.






