- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. నేడు ఒకేసారి విచారణకు ఆ ఐదుగురు
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ (SIT) దర్యాప్తును ముమ్మరం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఇవాళ బిగ్ డే కానుంది. నేడు విచారణలో భాగంగా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)తో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగ రావులను ప్రశ్నించనున్నారు. ఎవరి ఆదేశాలు మేరకు మొత్తం 42 హార్డ్ డిస్క్ (Hard Disks)లను ధ్వంసం చేసి.. వాటి స్థానంలో కొత్తవి అమర్చారు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? అన్న అంశాలపై వారిని ప్రధానంగా ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు సంధించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్క్‌లలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారించనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 400 మంది నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అందులో రాజకీయ నేతలు, జర్నలిస్ట్‌లు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు.
ఏసీపీ ఎదుట టీపీసీసీ చీఫ్ వాంగ్మూలం..
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ (SIT) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)ను రెండు దఫాలుగా విచారించిన అధికారులు ఇవాళ సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని ఏసీపీ వద్దకు సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. అయితే, నవంబర్ 2023 సాధారణ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మొబైల్‌ను అప్పటి బీఆర్ఎస్ (BRS) సర్కార్ ట్యాప్ చేసింది. దీంతో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న మహేష్ కుమార్ గౌడ్‌ను స్టేట్‌మెంట్ ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వనున్నారు.






