FLASH.. FLASH: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పది ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-01 12:05:58  IST  )

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పది ఫలితాలు రానే వచ్చాయి.

FLASH.. FLASH: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పది ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పదోతరగతి వార్షిక ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటి ‘పది’ ఫలితాల్లో ఎప్పటిలాగే తమదే తిరుగులేని ఆధిపత్యమని నిరూపించారు. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం ఫలితాల్లో గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది 4,629 స్కూల్స్ 100 శాంత ఉత్తీర్ణత సాధించగా ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి. ఫలితాలు వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఎస్ఎస్ఎసీ బోర్డు పేర్కొంది. ఈ సారి జీపీఏ విధానం తొలగించి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల విధానం తీసుకువచ్చారు. కనీస మార్కులు వస్తే పాస్ లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేశారు.

మహబూబాబాద్ టాప్ వికారాబాద్ లాస్ట్:

ఈసారి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా 99.29 శాతంతో అగ్రస్థానంలో నిలువగా, వికారాబాద్ జిల్లా 73.97 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 99.09 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 88.53 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ 30వ స్థానంలో నిలిచింది. గతేడాది నిర్మల్ జిల్లా టాప్ లో ఉండగా వికారాబాద్ జిల్లా చివరి స్థానం దక్కించుకున్నాయి. ఈసారి ప్రైవేటు స్కూళ్లను వెనక్కి నెట్టి 98.79 శాతం ఉ్తత్తీర్ణతతో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం పొందాయి. అత్యధికంగా 94.01 పర్సంటేజ్ తో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా తెలుగు మీడియంలో 83.46 శాతం విద్యార్థులు, 87.72 శాతం మంది ఉర్దూ మీడియం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సబ్జెక్టుల వారీగా సాంఘీక శాస్త్రంలో అత్యధికంగా 99.43 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా అత్యల్పంగా గణితంలో 96.18 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరగు జరిగిన పదోతరగతి వార్షిక పరీక్షలకు మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరయ్యాయి.

జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు:

జూన్ నుంచి 13వ తేదీ వరకు పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షళు నిర్వహించబోతున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు మే 16 వరగు గడువు ఇచ్చింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు మే 15 వరకు చాన్స్ కల్పించారు. సబ్జెక్టుకు రూ. 500 చెల్లించి రీకౌంటింగ్ దరఖాస్తునకు, సబ్జెక్టుకు రూ. వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Next Story