బీఆర్ఎస్‍కు BIG బూస్ట్.. పాదయాత్రపై కేటీఆర్ కీలక అప్ డేట్

by Prasad Jukanti |

తన పాదయాత్ర, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్‍కు BIG బూస్ట్.. పాదయాత్రపై కేటీఆర్ కీలక అప్ డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: త్వరలోనే పాదయాత్ర చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2027లో తప్పకుండా పాదయాత్ర చేస్తానని చెప్పారు అయితే ఎప్పుడు ఎక్కడ ప్రారంభం అనేది మాత్రం పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఇవాళ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. పలు అంశాలపై స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై పెద్దఎత్తున రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పొత్తులపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 2014,2018,2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరితో పొత్తులు ఉండబోవన్నారు.

కాంగ్రెస్‍పై విమర్శలు:

తుమ్మిడిహట్టి అనేది రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్ అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కూర్చుంటున్న ఆఫీసులోనే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుకు పెంచడానికి ఒప్పుకోము అని రాసిన లేఖలు ఉన్నాయన్నారు. గతంలో కేంద్రంలో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇందుకు మహారాష్ట్ర అంగీకరించలేదన్నారు. అంత పట్టుదల ఉంటే పోయి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఇంటి ముందు రేవంత్ రెడ్డి నిరహార దీక్ష చేయాలన్నారు.

Next Story