బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో భారీ వర్షాలు

by Malleboina Mahesh |

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వానలు పడుతున్నాయి.

బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వానలు పడుతున్నాయి. తాజాగా ఈ రోజు కూడా తెలంగాణ (Telangana)లో అధిక జిల్లాలో దట్టమైన మేఘాలతో అలుముకున్నాయి. దీంతో రాష్ట్రంలో చల్లని వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న రెండు గంటల్లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో పైన తెలిపిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్‌మ్యాన్ (Telangana Weatherman) అలర్ట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో కూడా మరో గంటలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, సాయంత్రం, రాత్రి సమయానికి దట్టమైన మేఘాలు అలముకొని భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెదర్ మెన్ తెలిపారు.

Next Story